Dil Se Dekho





దిల్ సే దేఖో Life  ని ఒక కొత్త స్ఫూర్తి తో
జోర్ సే బోలో I Can  Do It అనే ప్రగతి పధంతో

అప్పుడే  అప్పుడప్పుడే , ఎప్పుడో ఎప్పుడెప్పుడో 
అంటూ మదనపడుతూ చింతిస్తావా ?

ఇప్పుడే ఇంకిప్పుడే ! ఇక్కడే  ఇంకిక్కడే అంటూ
 నీ మనస్సు  మౌనాన్ని వదిలేస్తావా??

పరితపించేది ఎప్పుడు ?ప్రయత్నించేది ఎప్పుడు?
పరుగులు తీసేది ఎప్పుడు?పులకరించేది ఎప్పుడు ?

తమస్సుని తరిమేస్తూ , ఉషస్సుని ప్రతిబింబిస్తూ
తపస్సుకై నీ మనస్సుని మళ్ళించు!    

అక్షరాలే నీకు ఆయుధమై , నీ లక్షణాలే నీకు సాయుధమై
లక్ష్య సాధనకి అడుగులు వేసేయ్!

కలలే  నీ ఆశలై , కళలే  నీ శ్వాసలై 
విజయ రెక్కలతో విహరించేసేయ్!

దిల్ సే దేఖో Life  ని ఒక కొత్త స్ఫూర్తి తో
జోర్ సే బోలో I Can  Do It అనే ప్రగతి పధంతో

P.S - ఈ కవిత రాయడానికి Inspiration కేరింత సినిమాలోని  Thanks To Zindagi పాట 
Pic Credit - వజ్ర అలేఖ్య 

Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

Truth vs Fiction