జ్యో అచ్యుతానందం

తెలుగు భాష! ఎందుకో ఏమో తెలియకుండా తెలుగు భాషపై అభిమానం,మక్కువ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఒక విధంగా చెప్పలి అంటే చిన్నపుడు నేను చదువుల్లో చాలా dull. అన్నిటిలో కంటే తెలుగు సబ్జెక్టు లో ఎక్కువ మార్కులు వస్తుండేవిప్రతిసారి పరీక్షలు వ్రాసినప్పుడు తెలుగునే మొదటి పరిక్షఅప్పుడు అనుకునే వాడిని  సారి అయినా వేరే పరీక్షల్లో తెలుగులో మించి ఎక్కువ మార్కులు వస్తాయా లేదా అని?ఎక్కువ మార్కులు రాలేదు కానీ మిగితా పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వాడిని :((esp Maths,Science)ఒకటి ఏమో మాతృ భాష, ఇంకా అన్నిటిలో కంటే తెలుగులో ఎక్కువ మార్కులు రావడం, పై తెలుగు సినిమా ప్రభావం. మా తాతయ్య వల్ల ఏమో తెలుగు న్యూస్ పేపర్, ఇంకా ఈనాడు సండే స్పెషల్ పుస్తకం తప్పకుండ చదవడం అలవాటు అయ్యింది. ఇన్ని ప్రభావాలు ఉన్నాక తెలుగు భాషపై అభిమానము ఎందుకు తగ్గుతుంది ?


ఇక ప్రస్తుత సినిమా విషయానికి  వస్తే..
జ్యో అచ్యుతానంద! … మధ్య ట్రైలర్ చూసాను. స్టోరీ డిఫరెంట్ గా ఉంది అనిపించింది. పాటలు కూడా చాలా సాహిత్య పరంగా విన సోంపుగా ఉన్నాయిదానికి తోడు దర్శకుడు శ్రీ అవసరాల తీసిన ఇంతకు ముందు సినిమా(ఊహలు గుస గుస లాడే) కూడా చాలా బాగా ఉంది. ఇన్ని కారణాల వల్ల సినిమా తప్పకుండ  చూస్తాను అని నిర్ణయించుకున్న.ఇక సినిమా చూసాక అలా గాల్లో తేలిపోయాను. సినిమాలోని అద్భుత సన్నివేశాలు,సంభాషణలు,తెలుగుతనం,మాధుర్యమైన పాటలు  ఇలా ఇన్ని ఉన్నాకనేను సినిమా గురించి రాయకుండా ఎలా ఉండగలనుసాధారణంగా ఒకే సన్నివేశం రెండు సార్లు (వేరే వేరే నటుల పై) తెరపై వచ్చినప్పుడు ప్రేక్షకుడికి బోరింగ్ అనిపిస్తుంది చాలా మటుకు.కానీ సినిమాలో అలా అనిపించలేదు. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తొ దర్శుకుడు శ్రీ అవసరాల చాలా బాగా తీసాడు.
ఇక సినిమాలోని మాటలు అమృత పలుకులు.చిన్నప్పుడు నేర్చుకున్న విభక్తులు మళ్ళీ గుర్తుకువస్తాయి. ఉదాహరణకు  జ్యో (రెజినా కస్సా ఆండ్ర) ఎమ్ ఓయి! అని  నారా  రోహిత్ ని పిలిచినప్పుడు,చూసావా ఎలా పిలుస్తుందో  సంబోధన  ప్రధమ విభక్తి అని  నాగ శౌర్యకి  చెబుతాడుఇంకొక సన్నివేశంలో అమ్మ వాళ్ళ ఇద్దరి కొడుకులతో అంటుంది, కలిసి ఎలా అయినా మీరు సంతోషంగా ఉండట్లేదు, కనీసం వీడి పోయి సుఖంగా ఉండండి అని. ఈ సంభాషణలో ఎంత పరిణతి ! నేటి ఆధునిక కాలంలో బేధ అభిప్రాయాలు,మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. సమాజ వాతావరణం (మనుషులు) కూడా ఒక కారణం. అన్నయ్య పై తమ్ముడికి, తమ్ముడుపై అన్నయ్యకి ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రేమలు ఊరికే బయటకు రావు అంతే. ఎప్పుడైనా అన్న తమ్ముళ్లు రామ లక్ష్మణులే. 

ఒక లాలన పాటలో అన్నతమ్ముళ్ల అనుబంధం గురించి ఎంతో రమణీయంగా గేయరచయిత(భాస్కర్ భట్ల గారు) వివరిస్తారు.

కల బోసుకున్న ఊసులు  ఏమన్నాయో ఏమో , పెనవేసుకున్న ప్రేమలు మెలిమెల్లిగా  ఎటు పోయెనో

ఎనెన్నో మాటలు/పలుకులు ఇప్పుడు లేవు.చిన్నప్పటి నుండి ఉన్న ఎన్నో ప్రేమబంధాలు మెల్లిగా ఏటో వెళ్లిపోయాయి.ఇందాకా చెప్పినట్టు బేధాభిప్రాయాలు, మనస్పర్హలు వల్లే ఒకరికొక్కరు  దూరంగా ఉంటున్నారు. దాని గురించి రచయిత ఎలా వివరించారో చుడండి

ఇంత కాలం దాచుకున్న ప్రేమని , హాయిని , కాలం ఏది దోచుకోదు ఇమ్మని
పెదవి అంచు మీద నవ్వుని , పూయున్చుకోవడం నీ పని
నీ మౌనమే మాటాడితే  దారి చేరుకోదా ఆమని .

ఈ  క్రింది చరణంలో ఎంతో వివరంగా,అద్భుతం గా  చెప్పాడు రచయిత .

అందనంత దూరమెగా నింగికి నేలకి , వాన జల్లే రాయభారం వాటికీ
మనసు ఉంటె మార్గం ఉండదా ? ప్రతి మనిషి నీకే చెందడా ?
ఈ బంధమే ఆనందమే , నువ్వు మోసుకెళ్లే సంపద .

ఆకాశం పైన ఉంటుంది , నేల కింద ఉంటుంది. వాటి ఇద్దరి రాయ బారి వాన జల్లు . మరి అలానే మనస్సు ఉంటె మార్గం ఉంటుంది,  బంధాలు విడిపోకుండా ఉండడానికి .

ఆద్యంతం సినిమా మొత్తం దర్శకుడు తెలుగు సంభాషణలు  ఉపాయగించాడు. ఇక పాటల్లో కూడా స్పష్టమైన సాహిత్యం. ఇవాళ రేపు వచ్చే పాటల్లో సాహిత్యం తక్కువ, హల్ చల్ ఎక్కువ. కానీ ఇందులో ప్రతి పాట వింటుంటే  ...ఆహ ! అది  అద్వైతం. ఎప్పటి నుండో బుచ్చి బాబు గారి చివరకు మిగిలేది తెలుగు పుస్తకం చదవాలని అనుకున్నాను. మెల్లిగా ఆ పుస్తకమే మర్చిపోయాను . ఈ సినిమా ద్వారా దర్శకుడు మళ్ళి నాకు ఆ పుస్తకం గుర్తు చేసాడు. ఈ పుస్తకం గురించి తెలియని వారు ఎందరో ఉంటారు. ఒక విషయం మాత్రం చెప్పగలను, ఈ సినిమా చూసాక చాలా మంది ఈ పుస్తకం పై అన్వేషణ ప్రారంభిస్తారు, చదవాలని  అనుకుంటారు.

ఆకు పచ్చని చందా మామల మారిపోయే భూలోకం . ఈ పాట కూడా నాకు చాలా నచ్చింది.ఈ పాటలోని సాహిత్యం , తియ్యని కావ్యం (ఆహ ఆహ బాగున్నది).శృతి పరంగా శ్రావ్యమైన స్వర బాణీలను  శ్రీ కల్యాణ రమణ గారు అందించారు. 

ఈ సినిమా నచ్చడానికి వ్యక్తిగతంగా ఒక కారణం కూడా ఉంది.ఈ చిత్రంలో  కధ నాయకులు (రోహిత్,నాగ శౌర్య) ఒక సందర్భంలో ఒకరి ఇంట్లో దొంగతనం చేస్తారు. ఆ సన్నివేశం నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన స్మృతులు నెమరు వేసుకున్నాయి.(దాని గురించి తరువాత వివరంగా ఇంకో post రాస్తాను)

చిన్నప్పుడు నానమ్మ, తాతయ్య కబుర్లు చెబితే , ఇంకా వినాలనే తాపత్రయం,
Imax లో మాయాబజార్  సినిమా చూస్తే, అలా కదలకుండా చూస్తూ ఉంటె మనస్సుకు కలిగే తన్మయత్వం!
రెస్టారంట్ వెళ్లి బిర్యానీ మొత్తం Fork/Spoonతో కాకుండా అలా చెయ్యితో తింటే(అంటే నేను ఎప్పుడు ఇలానే తింటాను)ఉండే మజా !
ఇక్కడ యూ.స్ లో కార్ లో వెళ్తున్నపుడు ఎప్పుడు వచ్చే ఇంగ్లీష్ పాప్ F.M రేడియో నుండి ఒక్క సారిగా  అలనాటి తెలుగు పాట మాధుర్యం వినేటప్పుడు పొందే ఆనందం, 
సెల్ ఫోన్ లేని ఆ రోజుల్లో(చిన్నప్పడు) స్నేహితులతో కలిసి బయట ఆ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆడుకున్నప్పడు కలిగే అనుభూతి !ఇవన్నీ నాకు  సినిమా చూసాక అనిపించాయి.  

ఇంకా ఇంకా చెప్పాలి అంటే

జోస్యం కాదు ఇది,నిజమైన నిజం
జోరందుకున్నవి కలెక్షన్లు కావు, సినీ ప్రేమికుల మనస్సులు 
జోలా పాటల వలె గేయ మాధుర్యం 
జోకులు ఎన్నో, అందరిలో నవ్వులు విరబూసెన్
జాలువారే అందం, నటన రెజినా మయం 
జిల్ జిల్ మెరుపుల నటన శౌర్యం(నాగ శౌర్య) , అభినయం రోహిత్(నారా) సొంతం 
జోహార్లు నటి నటులకి ,జోతలు సాంకేతిక నిపుణులకు
జ్యో అచ్యుతానంద!జ్యో అచ్యుతానంద!  

మధురమైన సంగీతం
తేనే లూరే మాటలు
కట్టిపడేసే కథ
నటన చాతుర్యం 
అనుబంధాలు అనురాగాలు 
స్క్రీన్ ప్లే  నైపుణ్యం 


వీటి అవసరాలు తెలుగు సినిమాకి ఈ మధ్య కాలంలో చాలా అవసరం. అలాంటి అవసరం ఇక నుండి మనకు ఉండదు . శ్రీ అవసరాల ఇవన్నీ తన సినిమాలో చూపిస్తున్నాడు.మొన్న పెళ్లి చూపులు, నిన్న మనమంతా ఇప్పుడు జ్యో అచ్యుతానంద. ఇలాంటి సినిమాలే  తెలుగు సినిమా స్వర్ణ మయంలో వెళుతుంది అని చెప్పడానికి ఒక శుభ సూచకం   


Comments

  1. Did you watch the movie? Sorry dont know Telugu. The trailer looks good.

    ReplyDelete
    Replies
    1. Yes I watched and so the reason for this post about the movie. Sorry Shital Sometimes based on the content/Subject I have to write the post in Telugu :).Thank You

      Delete

Post a Comment

Thank you for commenting.Your Golden words will be a route for me to get inspired to write the platinum posts...:) :)

Popular posts from this blog

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

ONCE AGAIN