అద్దం లో చూసుకుంటూ , మీసాలను సరి చేసుకొని , టేబుల్ పైన ఉన్న కళ్ళజోళ్ళని తీసుకొని తెల్లటి వస్త్రం తో తుడిచి కళ్ళజోళ్ళని పెట్టుకున్నాడు , పక్కన ఉన్న వాకింగ్ స్టిక్ పట్టుకొని బయట వరండా కి వచ్చాడు సూర్యం. తన వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అని అటు ఇటు నేలపై చూసాడు . ఎక్కడ కనపడలేదు .
అమ్మ కావేరి , నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాడు సూర్యం .
తెలీదు నాన్న , అక్కడే ఎక్కడో ఉంటాయి చుడండి అని
ఇంటి లోపల నుండి మాటలు వినిపించాయి సూర్యానికి .
ప్రొదున్న ఇక్కడే విడిచాను కదా ..ఎక్కడికి పోయాయి అని నేల పై చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సూర్యం
(సూర్యం తాత అని వెనకనుండి పిలుపు సూర్యానికి వినిపించింది) ఒరే మనవడా నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అనే లోపు...
నాకు తెలుసు తాత ,,ఇదిగో నీ కోసమే కొత్తవి తెచ్చాను అంటూ ఇచ్చాడు .
ఇప్పుడు కొత్తవి ఎందుకు రా , పాతవి బాగానే ఉన్నవి కదా ..అనవసరమైన
ఖర్చు ?
అబ్బా మీరు ఎం మాట్లాడకండి , ముందు కుర్చీ మీద కూర్చోండి అంటూ , కాళ్ళకి తొడిగాడు తన మనవడు.
మనవడు పేరు చెప్పలేదు కదా ..పేరు శౌర్య, సూర్యానికి శౌర్య అంటే చాలా ఇష్టం. శౌర్య కి కూడా అంతే ఇష్టం. శౌర్య కి ఇప్పుడు 24 ఏళ్ళు . సూర్యం తాత వయసు 75 . సూర్యానికి
రోజు
సాయంత్రం ఇంటి దగ్గర్లో ఉన్న పార్క్ కి వెళ్లడం ఇష్టం. చల్లటి గాలి, నిశ్శబ్దం , పక్షుల రాగాలు , అలా నేచర్ కి దెగ్గరగా నడవడం సూర్యం రోజు చేసే పని. సుమారు 15 సంవత్సరాలు అయ్యాయి సూర్యం తెలుగు టీచరుగా రిటైర్ అయ్యి . చిన్నప్పటి నుండి శౌర్య ని పార్క్ కి సాయంత్రం తీసుకెళ్లడం సూర్యానికి అలవాటు ..ఆ అలవాటే ఇప్పుడు రోజు దినచర్య అయ్యింది.
శౌర్య తో కబుర్లు చెప్పడం , మాట్లాడడం చాల ఇష్టం సూర్యానికి. శౌర్య అడిగిన ప్రశ్నలకు సందేహాలను తీరుస్తూ, తన చిన్న నాటి విషయాలు , జీవిత పాఠాలు , తాను చదివిన పుస్తకాల గురించి , శౌర్య కాలేజీ విషయాలు , current affaris ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు.
అన్ని విషయాల్లో సూర్యం సంతోషంగా ఉన్న , ఒకే ఒక విషయం లో వెలితి. చిన్నప్పుడు తన నాన్న తనకు ఇచ్చిన 2000 పేజీల పుస్తకం ఇంకా చదవలేదు అనే బాధ . ఆ పుస్తకానికి పేరు లేదు. రోజు పడుకునే ముందు ట్రంకు పెట్టె లో ఉన్న ఈ పుస్తకాన్ని చూసి ఒక kind అఫ్ రిగ్రెట్ తో తెల్లగా ఉండే ఆకాశం ల పుస్తకాన్ని చూస్తూ, ఎగసి పడే తెల్లటి అలలు తన పై వస్తున్నట్టు అనిపిస్తూ ఉండేది . వెంటనే ట్రంకు పెట్టని క్లోజ్ చేసి నిద్ర లోకి వెళ్ళేవాడు సూర్యం .
బహుశా అందుకే ఏమో పుస్తకం చదవాలని ఉన్న చదవలేక పోతున్నాడు.
ఒక రోజు తాత ఆరోగ్యం బాగా లేదు
షుగర్ లెవెల్స్ తక్కువ అయ్యాయి . తనకి బెడ్ రెస్ట్ కావాలి అని డాక్టర్ చెప్పింది.
(బెడ్ మీద ఉన్న తాత ని చూసి శౌర్య కళ్ళలో కన్నీరు)
ఎందుకు రా మనవడా ఆ ఏడుపు
నిన్ను ఇలా చూస్తే నా కన్నీళ్లు ఆగట్లేదు తాత
అంటే నేను పోతాను అని డిసైడ్ అయిపోయావ్ అన్నమాట
తాత, అవేం మాటలు (అంటూ మంచం పై కూర్చొని , తాత చెయ్యి పట్టుకున్నాడు )
మరి లేకుంటే ఏంటి రా ....
In Celebration
Of Being Alive అని Dr.Christian
Bernard స్టోరీ చిన్నప్పుడు నువ్వు చదివావు కదా రా . సరదా గా కబుర్లు చెప్పుకుందాం.
నీ కాలేజీ కబుర్లు ఏంటి ? ఇంతకీ నీ ప్రేమ గురించి తనూజ కి చెప్పవా?
ssh మెల్లిగా తాత , అమ్మ నాన్న వాళ్ళు వింటారు ?
తానే(తనూజ) నాకు చెప్పింది...
ఓహ్ చెప్పడం కూడా
అయిపోయిందా , భడవా . అయిన నువ్వు అంత బాగా ఉండవు కదా రా?
పో తాత .. నేను ఎవర్ని ?..నీ మనవడిని ..
హ
హ హ ...అన్ని నా పోలికలే
నాకు తెలుసు తాత... అమ్మమ్మ నే కదా నిన్ను మొదట ఇష్ట పడింది
?
(వాళ్లిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడడం చూసి శౌర్య అమ్మ నాన్న చూసి హ్యాపీ ఫీల్ అవుతారు)
రోజులు గడిచే కొద్దీ సూర్యం ఆరోగ్యం క్షణించింది. ఒక రోజు తన మనవడు షోర్య కి తాను చదవలేక పోయిన పుస్తకం గురించి చెప్పాడు.
ఒరే మనవడా !
ఇది మా నాన్న నాకు ఎంతో ఇష్టం తో ఇచ్చాడు రా . ఇప్పటికి ఈ పుస్తకం గురించి ఎవ్వఁరికి చెప్పలేదు . ఇది నేను చదవకపోయినా , ఇది మనసు కు నచ్చే స్నేహితుడు . ఎంత ఇష్టపడిన , అంతే భయం ఉండేది నా గుండెల్లో
ఈ పుస్తకం చూసినప్పుడు . ఎందుకో నాకు అర్ధం కాదు ..బహుశా ఎప్పుడో ఇచ్చిన పుస్తకం ఇన్ని years చదవలేదు అని ప్రాశ్యతాపం
వల్ల కావచ్చు. ఈ పుస్తకం చదవలేదు అనే అసంతృప్తి ఇంకా నాలో ఉంది . నా లోని తెలియని భయం వల్ల చదవలేకపోయాను . ఇదిగో , ఈ పుస్తకం నీకు ఇస్తున్నాను . నేను ఎలా అయినా చదవలేదు , కనీసం నువ్వు చదువు రా .
కొన్ని రోజుల తరువాత సూర్యం తాత ..ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు
(2 సంవత్సరాల తరువాత)
ఒకరోజు శోర్యకి తన తాత చెప్పిన పుస్తకం గురించి గుర్తు వచ్చింది. వెంటనే తాతయ్య
ఇచ్చిన ఆ పేరు లేని పుస్తకాన్ని తాత తో వెళ్లే పార్క్ కి వెళ్లి చదవడం ప్రారంభించాడు.
చదువుతున్న కొద్దీ శౌర్య కళ్ళలో ఆనందం , తెలియని ఉద్వేగం...
2nd రోజు సాయంత్రం
ఇంటి దాబా పై పుస్తకం చదవడం అయిపోయింది. శౌర్య కళ్ళలో ఆనంద బాష్పాలు.
ఆకాశం నారింజ రంగులోకి మారుతున్నది... శౌర్య ఆకాశం వైపు చూస్తూ (తన మనసులో తాత తో మాట్లాడుతున్నాడు )
నీకు ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు తాత. నువ్వు చిన్నప్పటి
నుండి నాకు చెప్పిన జీవిత విశేషాలు , మీ అమ్మ నాన్న తో కలిసిన మధుర క్షణాలు , నువ్వు
రోజు పార్క్ లో నాకు చెప్పిన విషయాలు చాలా
ఇందులో ఉన్నాయి తాత. నువ్వు అసంతృప్తి పడాల్సిన
అవసరం లేదు . నువ్వ ఆల్రెడీ జీవితాన్ని చదివేసావ్ తాత .. అంటూ దాబా పై పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఆనందం గ చిరునవ్వు చిందిస్తున్నాడు.(This is similar to
the scene Ryan Gosling smiles after he made the Harrison Ford to meet to his
daughter in Blade Runner 2049 in climax)
ఎం ఓయ్ శౌర్య ..నువ్వు ఇక్కడ ఉన్నావా (తనూజ ).రెండు రోజులు
నుండి చూస్తున్న ..ఈ పుస్తకాన్నే చదువుతున్నావ్ ..ఆ పుస్తకం పేరు ఏంటి ?
పేరు లేని పుస్తకం
సర్లే చీకటి పడే ల ఉంది ... లోపాలకి వచ్చెయ్యండి .
నువ్వు వెళ్ళు
.. కాసేపట్లో వస్తాను.
శౌర్య కొంచెం చిరుహాసం
చేస్తూ ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాడు.
(ఇంతకీ కథ చెబుతున్న నేను ఎవరో చెప్పలేదు కదా? ఆ పేరు లేని పుస్తకాన్ని నేనే )