Pages

Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సినిమా  - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు Simple but beautiful 
ముఖ్య తారాగణం - విక్టరీ వెంకటేష్ , ప్రిన్స్ మహేష్ , సమంతా,అంజలి,ప్రకాష్ రాజ్,సహజ నటి జయసుధ,రోహిణి హట్టంగడి,అభినయ,కోట,తనికెళ్ళ భరణి,రావు రమేష్, రమప్రభ  తదితరాలు.
కథ/ స్క్రీన్ ప్లే/ దర్శకత్వం - శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత - దిల్ రాజు
సంగీతం - మిక్కీ J Mayer
BGM  - మనిశర్మ
ఎడిటింగ్ - మార్తాండ్ k వెంకటేష్
సినిమాటోగ్రఫీ  - k .v గుహన్
పాటలు - సిరివెన్నెల,అనంత్ శ్రీ రామ్
విడుదల తేది - Jan 11, 2012

                                                                      

సారాంశం
ఆ పెద్దోడు చూస్తే మాట పడడు ..ఈ చిన్నోడు ఏమో మాటలతో బూరెలేస్తాడు.
పెద్దోడు ఎవరో కాదు అండి మన వెంకటేష్ బాబు ఇంకా చిన్నోడు ఎవరో చెప్పానక్కరలేదు అనుకుంట..అదేనండి మన మహేష్ బాబు.ఆయనే అండి బాబు మీరు ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర వేడి చేసుకోకండి. పెద్దోడు,చిన్నోడు ఎవరో మాకు తెలుసులేవోయి ముందు సినిమా గురించి చెప్పండి అని నన్ను తిట్టుకుంటున్నార..! అయితే ఓ.కే..సినిమా సందడిలోకి వెళ్దాం పదండి..! 
అన్నయకేమో ఆగ్రహం,అహంకారంతో(అంటే positiveవేలో) పాటు తమ్ముడి మీదే అనురాగం,ఆప్యాయత ఉంటుంది. అలాగే తమ్ముడికి అన్నయ అంటే భయం, భక్తి మరియు ప్రేమ ఉంటుంది.




నేటి సమాజంలో... కాదు కాదు నేటి సమాజం అని అనడం బదులు ఎప్పటినుండో ఈ సమాజంలో అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది.నువ్వు ఎలాగా అనుకుంటే మాకేంది..నీ సోది వినలేక చస్తున్నాం నువ్వు continue చెయ్యు మహాప్రబ్బో అని నా పై చివాట్లు పెట్టకండి..అక్కడికే వస్తున్నా..ఎక్కడ ఆపాను ..ఆ అదే ఈ లోకంలో అందరు ఇంట్లో ఉండే  అన్నదమ్ములు ఒకెలా ఉంటాలేదు.దాశరథుడి ముద్దు బిడ్డలుగా ఉండండిరా బాబు అంటే లేదు మేము దుర్యోధన ద్రుష్ట పుత్రులగా ఉంటాం అని అంటున్నారు.గుమ్మడికాయ వలె ఉమ్మడి కుటుంబం మేలు అనుకుంటే వాళ్ళు డబ్బు,ఆహం,మధం,క్రోధం అనే గారడిలో పడి విడి కుటుంబంగా ఉంటున్నారు. పోనీ విడిగా ఉండి ఆనందంగా ఉంటున్నారా అంటే అది లేదు. సర్లే ఎం చేస్తాం ..తప్పు వాళ్ళది కాదు..డబ్బుది? అవును మనిషి అనే వాడు ఆకలితో బ్రతుకతలేదు ఆశతో జీవిస్తున్నాడు.
సో పైన చెప్పిన విషయాలకి పూర్తిగా విరుద్ధంగా ఉండే సినిమా ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.అన్నదమ్ముల   అనుబంధాల కలయిక మరియు  అందరి ఇంట్లో ఉండే కుటుంబసాగర దృశ్య మాలిక ఈ సినిమా. మంచోడంటే మనిషి ఎదురుపడ్డ వాళ్ళందరిని పలకరించుకుంటూ పోవాలి.సో ఈ  పాయింట్ ద్వారా సినిమా నడుస్తుంది. Taglineలో ఉంది కదండీ! Simple  but beauiful అని...సో  ఆ చిన్న పాయింట్ మీద ఈ  సినిమా ఎంత అద్బుతంగా  ఉంటుందో తెలుసుకోవాలంటే మనం సినిమాకి వెళ్ళవలిసిందే.




                    
ఇంకా నువ్వు నటించింది చాలు వాళ్ళ నటన ఎలా ఉందొ చెప్పు బాబు..
ప్రిన్స్ Mahesh ఎప్పటిలాగే తన positive energyతో నటించాడు.Venki తన typical వెంకటేష్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. అన్నదమ్ములుగా ఇద్దరు అదరగొట్టారు.ఇక సీతగా నటించిన అంజలి తన stellar performance తో ఆ పాత్రలో జీవించింది.అస్సలు అమ్మాయి అంటే ఇలాగె ఉండాలి అనట్టు సీత నటించిన తీరు వర్ణణాతీతం! ఇక పిట్ట మొహం(Samantha ) సారీ దూకుడు కాదు కదా..తన కొంటె పిల్ల చేష్టలతో అలరించింది. అందరి గురించి చెప్పి ప్రకాష్ రాజ్ గురించి చెప్పకపోతే ఎలా ..! నాన్నగా ప్రకాశ్ రాజ్ నటన awesome.అందరు బాగుంటే మనం బాగుంటం అనే పంథాలో నడుస్తూ తండ్రి పాత్రలో అద్బుతంగా నటించాడు.ఇక జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పలా.ఎప్పటిలాగే తన సహజ నటనతో నటించింది.మిగిలిన వారు వారి వారి పాత్రలకు తగట్టు చక్కగా నటించారు.

దర్శకుడు గురించి
దర్శకుడు శ్రీకాంత్ Addala..ఒక్క సింపుల్ లైన్ ని story themeగా తీసుకొని కథగా మళ్లించిన తీరు అద్బుతం. ప్రేక్షకుల గుండె సవ్వడిని తెలుసుకొని  Commercial elements తో వచ్చే నేటి సినిమాలను తొక్కేసి మంచి కుటుంబ కథ తీసినందుకు దర్శకుడికి జోహార్లు. ఇది తన రెండవ సినిమా అయిన,ఇద్దరు పెద్ద కథానాయకులని పెట్టి  ఒక కుటంబ చిత్రాన్ని flawlessగా తీసాడు.

Summary
ఇంకా చివరిగా ఈ సినిమా బాగుంది,బాగాలేదు అని చెప్పలేము.కానీ సింపుల్ గా ఇది ఒక మంచి తెలుగింటి సినిమా.గాలిపాటలా హరుతో,భోగి మంటల వేచ్చేని వెన్నల్లో వలె,గొబ్బెమ్మల అలంకరణతో ముత్యాల ముగ్గుల ముంగిట్ల,డు డు బసవన్నల సన్నాయి మేళ రాగాలతో,కమ్మనైన పిండి వంటలు,అందమైన పెళ్లి జంటలు,ఇంటికొచ్చే పాడిపంటలతో ఎటేట జరుపుకునే సంక్రాంతి పండుగకు ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అదనపు ఆకర్షణ.
Twitter Bird Gadget