కాలానికి కోపం వచ్చింది ..
దూరాలు దాటి ..కొండలు ఎక్కి..కన్నీళ్ళతో విన్నపాలని వేడుకునే వేల..
ప్రకృతి అందాలు చల్లారబడ్డాయి
వికృతి చేష్టలు విహరించాయి ....
ప్రజల వేదనకు వరుణుడి ఆవేదన ఎక్కువ అయ్యింది..
విపత్తు విలయ తాండవం చూపెనే...
ఓ మూడు కనులోడ ..ఎమిటి ఈ విలయరూపం…. ఎవరి పై నీ విశ్వరూపం ?
ప్రజలు అహంకారులు అని నీ భావన ?
ప్రజల వేదనలకి రోదనలు జతకట్టాయి ...
వరుణుడి రూపం వరదలతో ఉత్తరం నిండింది .. మా మనుషుల కన్నీరు ఎండిపోయాయి..
అహంకారంతో ఉండే అవినీతి పరులు బాగానే ఉన్నారు .. ఉంటున్నారు ..
అమయుకులైన పిచ్చి జనల ఆర్తనాదాలు నీకు వినిపించుట లేదా ....
శాంతించు ఓ కాలమా .. శాంతించు ఓ వరుణ దేవా.. శాంతించు ఓ త్రిలొకనాధ ..