అందరికి శుభవందనం!ఇదేంటి ఈ వెధవ ఇలా తెలుగులోకి మారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఎం లేదండి ..జస్ట్ ఫర్ Change ..కొంచెం మార్పూ కోసం ఇలా రాస్తున్నాను అంతేనండి.మన సమాజంలో కొంచెం మార్పూ రావాలి అంటే మనం కూడా మారాలి కదా.అందుకే అలా ఇళయరాజా గాణాలు వింటూ నా గగనయంత్రం(కంప్యూటర్) నుండి ఈ వ్యాసం రాస్తున్నాను.
ఎందుకో ఏమో కానీ చిన్నపుడు బుర్ర పెట్టలేదు ఈ అచ్చులు,హల్లులు,గుణింతాలు ఇంకా వగైరా వగైరా మీద. అందుకే మన తెలుగు బాష మీద ఎంత పట్టు ఉందో తెల్సుకుందామని ఇలా ఈ వ్యాసం తెలుగులో రాస్తునన్నమాట!ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటా...ఈ పింజారి వెధవకి మార్పూ ఎందుకు వచ్చిందో(lol)!తెలుగు భాషలో ఉన్న నేర్పు,స్పష్టత,కూర్పు,భావం నాకు చాలా బాగా నచ్చుతుంది.అందుకే అనుకుంట మన శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు " దేశ భాషలందు తెలుగు లెస్స " అని.నిజమే కదా !
ఎందరో మహనీయులు మన తెలుగు భాష ప్రాముఖ్యత గురించి చాటి చెప్పారు. అప్పటి తరం నన్నయ,తిక్కన నుంచి మొన్నటి తరం గురుజాడ,వీరేశలింగం పంతులు , నిన్నటి శ్రీ శ్రీ నుంచి నేటి సి.నా.రే ,వేటూరి,సిరివెన్నెల మన తెలుగు భాష మీద ఎన్నో సాహిత్యాలు, కావ్యాలు మరియు సినిమాలకు పాటలతో ప్రాణం పోసారు.
ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా ?సగం వరకు మన తెలుగు భాష మీద పట్టు వొదులుకుంటున్నారు.ఇంకా అమెరికాలోని మన తెలుగు పిల్లలు సంగతి గురించి చెప్పనక్కరలేదు.వీల్లైతే మరీను! అమ్మ,నాన్న సంస్కృతి మన తరం నుంచే పోయింది అనుకోండి.కానీ విల్లైతే ఏకంగా హే మోమ్(Mom) ,హే డాడ్ ,వాట్'స్ అప్ డాడ్ ?..ఇలా అంటుంటే అనిపించింది ఈ పిడుగులకి ఎంత ఉందో మన భాష మీద అవగాహనా అని..? మనం అ పిల్లల అమ్మ,నాన్నల్ని తప్పుబట్టలెం అనుకోండి, అది వేరే విషయం.అమెరికా దేశ సంస్కృతికి వాళ్ళు అలా అలవాటు పడ్డారు.ఒక అమెరికాలోనే కాదు ,దాదాపు చాలా విదేశాలలో ఇదే తంతు.నాకు తెలుసు ,చాలా మంది విదేశీ తల్లితండ్రులు ఈ విషయంలో కొంచెం నమ్మశక్యంగా ఉండరు !అబ్బ కానీ అది నిజమే కదండి..ఒప్పుకొండి..కాదంటారా ఫ్రెండ్స్?
మీకు ఒక సంఘటన చెప్పాలి,ఒక అబ్బాయి అమెరికా అబ్బాయి గురించి.నా స్నేహితుడు ఒకడు చెప్పాడు , వాళ్ళ స్నేహితుని అబ్బాయి గురించి.ఆ అబ్బాయి వాడి తమ్ముడిని చూపిస్తూ వాళ్ళ డాడ్ ని అడిగాడంట,డాడ్ who ఇస్ థిస్ dude అని.అక్కడ ఇంకా నవ్వులే నవ్వులు అనుకోండి,అది వేరే విషయం.
అందుకే ఈ తెలుగు భాషని అందలం ఎక్కియ్యడానికి,ఈ తరం పిల్లలకు వినిపించేందుకు ఎన్నో హాస్య పుస్తకాలు,కవిత్వాలు,హాస్యాలు Cd /Dvd రూపంలో అమ్ముడు అవ్వుతునాయి .అప్పటి మాయాబజార్ చిత్రాన్ని ఈ తరం వాళ్ళు అందరు చూడాలని డిజిటల్ మిక్సింగ్ తో రంగుల రూపంలో (కలర్స్) విడుదల చేసారు.మన శేఖర్ కమ్ముల కూడా లీడర్ చిత్రంలో మన రాష్ట్ర పాటలని డిజిటల్ మిక్స్ తో చూపించారు.ముఖ్యంగా మా తెలుగు తల్లికి,సిరులు పొంగిన పాటలు మన మనసుకి హత్తుకుంటాయి.
అప్పట్లో కళా తపస్వి మన విశ్వనాధ్ గారు ఎన్నో సినిమాలు తీసారు,అన్ని మన తెలుగుదనం సంస్కృతి,సాహిత్యంకి ఉట్టి పడుతాయి.ఇప్పటి తరంలో శేఖర్ కమ్ముల ఆ బాటలోనే నడుస్తున్నాడు.ఒక గోదావరి నదిని సబ్జెక్టుగా
తీసుకోని గోదావరి చిత్రాన్ని తీసాడు.ఆ చిత్రంలో ఆ గోదావరి నది ప్రాముఖ్యతని, తెలుగు బాష తియ్యదనాన్ని,పాపికొండలు అందాల్ని,మానవ బంధాల్ని మరియు పడవ ప్రయాణం ఇవ్వని చూపించి మంత్ర ముగ్దుల్ని చేసాడు.
సో ఇది అండి విషయం ,నాకు మన మాతృ భాష మీద ఎంత అవగాహనా ఉందో అని తెలుసుకుందామని ,నా జ్ఞానాన్ని అంత ఉపయోగించి ఈ వ్యాసం రాస్తున్నాను.ఇలా నా వ్యాసం చదివిన వాళ్ళు తెలుగు భాష ప్రాముఖ్యతని కొంచెం అన్న తెలుసుకుంటారు అని మరియు ఇతరులకు మన తెలుగు భాష తియ్యదాన్నని,సంస్కృతిని,సాహిత్యాన్ని చెప్తారు అని ఆకాంక్షిస్తూ ....,ఘర్షణలు,హింసకు వెళ్ళకుండా,కుల భేదాలకు అతీతంగా అందరు మానవబంధాలతో,ప్రేమ భావాలతో ,గుమగుమలాడే పిండివంటల లాగా, గగనంలో ఎగిరే పతంగులలాగా , ఈ సంక్రాంతి పండుగ అందరికి తియ్యటి పయసంతో ,జీవితంలో వెలుగులు నింపుతుందని, చందమామలాగా అందరు చల్లగా ఉంటారని భావిస్తూ...
ఇవ్వే నా సంక్రాంతి శుభాకాంక్షలు ...మీ నేస్తం వజ్ర.....