Posts

Showing posts with the label Telugu poems

Dil Se Dekho

Image
దిల్ సే దేఖో Life  ని ఒక కొత్త స్ఫూర్తి తో జోర్ సే బోలో I Can  Do It అనే ప్రగతి పధంతో అప్పుడే   అప్పుడప్పుడే , ఎప్పుడో ఎప్పుడెప్పుడో   అంటూ మదనపడుతూ చింతిస్తావా ? ఇప్పుడే ఇంకిప్పుడే ! ఇక్కడే   ఇంకిక్కడే అంటూ   నీ మనస్సు   మౌనాన్ని   వదిలేస్తావా? ? పరితపించేది ఎప్పుడు ? ప్రయత్నించేది ఎప్పుడు ? పరుగులు తీసేది ఎప్పుడు ? పులకరించేది ఎప్పుడు ? తమస్సుని తరిమేస్తూ , ఉషస్సుని ప్రతిబింబిస్తూ ఈ తపస్సుకై నీ మనస్సుని మళ్ళించు!      ఈ అక్షరాలే నీకు ఆయుధమై , నీ లక్షణాలే నీకు సాయుధమై లక్ష్య సాధనకి అడుగులు   వేసేయ్! కలలే   నీ ఆశలై , కళలే   నీ శ్వాసలై   విజయ రెక్కలతో విహరించే సే య్! దిల్   సే   దేఖో  Life   ని   ఒక   కొత్త   స్ఫూర్తి   తో జోర్   సే   బోలో  I Can  Do It  అనే   ప్రగతి   పధంతో P.S - ఈ కవిత రాయడానికి Inspiration కేరింత సినిమాలోని  Thanks To Zindagi పాట  Pic Credit - వజ్ర అలేఖ్య 

హాయిగా నిదురపో

Image
మేఘాలలో మెరుపులు చినుకుల చిటపటలు మల్లెల సుగంధాలు కిటికీ తలపుల  కదలికలు అల్లరి పిల్లల  కేరింతలు వంటింట్లో ఘుమఘుమలు స్వర మాధుర్య సరిగమలు ప్రియ సఖి(అర్ధాంగి)  అందాల అరుపులు చిలుకల పలుకులు , కోయిల రాగాలు  జతగా కలిసి లే లే అంటున్న కనురెప్పలు సరేలే ఇంకా నిదుర పో అంటున్న హాయిగా వీచే గాలి కెరటాలు    GIF Pic Credit -  http://www.buzzfeed.com/regajha/struggles-of-being-a-football-fan-in-india-right-now#.obD7l3KQe

నాలోని నేను - Part 1

Image
ఉ : 7:00 ... పక్షుల కిలకిలలు                ఉదయించే రాగాలు            Jazzy Beats ...Wake up from the morning dreams అనే తరహాలో వచ్చే హాయి అయిన సంగీతం .. అదే నా Phone Alarm! అంత మంచి సంగీతానికి స్పందించక .. ఫోన్ ని మళ్ళి   snooze లో పెట్టి పడుకునే అ నిద్దురను నేను . ఊహ లోకానికి దగ్గరగా ఉంటూ .. ఉషోదయాన్ని ఆస్వాదించే ఆశని నేను ! కోయిల కూతను ఆనందించే గాలి పటాన్ని నేను ఎన్నో కళలను   అభిమానించే అభిమానిని నేను ! ఎన్నో తీపి స్మృతులకి తియ్యని కావ్యాన్ని నేను నా లోని అంతరంగానికి అవకాశమివ్వక .. ప్రతి రోజు పరుగులు తీసే   అవకాశవాదిని నేను ! తప్పును ఓర్వలేని పంతాన్ని నేనే ! ఆ తప్పును తెలుసుకునే ప్రాశ్చతాపాన్ని నేనే ! లోకానికి బెదరని భావ పౌరుడు అనే భ్రమలో ఉన్న   కంటికి కనపడే కన్నీటి ధారను నేను !  

తవికానందం

Image
మొన్న పవన్ కళ్యాణ్ బాలా గంగాధర్ తిలక్ కావ్యం గురించి చెప్పినప్పుడు ..తిలక్ ని స్పూర్తిగా తీసుకొని రాసిన కావ్యం.... నిద్దుర  పోవాలనే నిరీక్షణ సమయంలో ...  ఆవలింతల అల్లర్ల నడుమ మసకబారిన చీకట్లో మూసుకుపోతున్న కనురెప్పల అలజడిలో అటు నిదిరించక ... అటు రేపు మేల్కొనక  మదిలోని భావాలను ... మనస్సుతొ స్వాగతిస్తూ... కవిత తొ కదిలించలనె  తాపత్రయం  తిక్క తిక్కగా ఇంతై  ఇంతింతై  ప్రవహిస్తూనే ఉంది..

చీకటి బ్రతుకు

Image
మనిషిగా నీ జీవితం ఒక వెలుగుల బ్రతుకు మనస్సుతో చూస్తే నీ జీవన రాగంలో చీకటి . నువ్వు అనే నీ దేహం ఒక వెలుగు కనిపించే నీ నీడ ..నీ చీకటి .. అదే నీ మనస్సు డబ్బులను వెతుక్కుంటూ  జీవితాన్ని ఆశతో బ్రతుకుతున్నాం మబ్బులను ( డబ్బులను) తొలగించి ఆనందాల ప్రపంచానికి ప్రయాణించే దారి ఎక్కడ ఉంది? నీకు నచ్చే నీ కళ.. కలగానే కళాత్మకంగా నిద్రలో బ్రతికేస్తు ఉంది నీ కళకు జీవం పోసే ఉషోదయం ఎప్పుడు వస్తుంది...?  నువ్వుగా నడిచే బ్రతుకు బండిని స్వార్ధం,పరువు అనే ఫలలతొ ఆశగా బ్రతుకుతు.. నేనుగా నడిచే మనస్సుని ఆశతో ఆలింగనం చేసే ప్రయత్నపు ప్రయాణం  అంధకారంలో జీవిస్తునే ఉంది.