చీకటి బ్రతుకు
మనిషిగా నీ జీవితం ఒక వెలుగుల బ్రతుకు
మనస్సుతో చూస్తే నీ జీవన రాగంలో చీకటి .
నువ్వు అనే నీ దేహం ఒక వెలుగు
కనిపించే నీ నీడ ..నీ చీకటి .. అదే నీ మనస్సు
డబ్బులను వెతుక్కుంటూ జీవితాన్ని ఆశతో బ్రతుకుతున్నాం
మబ్బులను ( డబ్బులను) తొలగించి ఆనందాల ప్రపంచానికి ప్రయాణించే దారి ఎక్కడ ఉంది?
నీకు నచ్చే నీ కళ.. కలగానే కళాత్మకంగా నిద్రలో బ్రతికేస్తు ఉంది
నీ కళకు జీవం పోసే ఉషోదయం ఎప్పుడు వస్తుంది...?
నువ్వుగా నడిచే బ్రతుకు బండిని స్వార్ధం,పరువు అనే ఫలలతొ ఆశగా బ్రతుకుతు..
నేనుగా నడిచే మనస్సుని ఆశతో ఆలింగనం చేసే ప్రయత్నపు ప్రయాణం అంధకారంలో జీవిస్తునే ఉంది.
nice comparison Vajra Garu ....!
ReplyDelete