Trivikram Srinivas - The Vision of Boundlessness(part 1)

అతని మాటల్లో లోతైన  జీవన తరంగాలు  కనిపిస్తయి.
అతని రాతల్లో స్ఫూర్తిదాయక సందేశాలు కనిపిస్తాయి.
వింటే  భారతమే  వినాలి  అన్నది  నిన్నటి అంశం. నేడు ట్రెండ్ మారింది..
వింటే త్రివిక్రమ్ మాటలే వినాలి అనే కొత్త సారాంశం యువతలో మత్తుగా ప్రవహిస్తుంది.


త్రివిక్రమ్ ఎవరు బాబు అని అడగకండి ? చాలా మందికి సుపరిచితమే ... ముఖ్యంగా సినీ ప్రియులకి సినీ బంధువు. సినిమా మీద ఉన్న పరవశం కావచ్చు, త్రివిక్రమ్ సినిమా లోని మాటల పై మక్కువ కావచ్చు త్రివిక్రమ్ గురించి రాయాలని ఎప్పటి నుంచొ  అనుకున్నను. వ్రాయల వద్దా, వ్రాయల వద్దా అని ఆలోచిస్తూనే... అలవాటు పడని నా ఆలోచనల అంతరంగములను అన్వేషిస్తూ రెండు వారాల క్రితం వ్యాసం వ్రాయడం మొదలు చేశాను. ఈ రోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కాబట్టి ఈ త్రివిక్రమ్ volume సిరీస్ లోని మొదటి భాగాన్ని క్లుప్తంగా  కాకుండా introduction perspective లో మొదలు పెడుతున్నాను.గంగా,యమున మరియు సరస్వతి నదులు కలిసే సంగమం త్రివేణి సంగమం. త్రివేణి సంగమంకి దగ్గరి నిర్వచనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు... ఎందుకు అంటారా ? తను మాట్లాడడం మొదలు పెడితే తన మాట కూడా వినని తన స్వర పలుకులు గంగ నది ప్రవాహం. ఆలోచించేల చేసే అతని రాతలు యమునా నది తీరం. మెదడే ఒక మంత్రంగా నిగూఢమైన మేదస్సు, విజ్ఞానం కలిగిన సరస్వతి పుత్రుడు త్రివిక్రమ్.

స్వయంవరం సినిమాతో మాటలా రచయితగా పరిచయం అయిన త్రివిక్రమ్ తన కలం ద్వారా మాటల తూటాలను అక్షరాలుగా అలంకరించి తెలుగు సినిమాకి కొత్త కళని తీసుకువచ్చాడు. అదే ప్రాస కల. intensive way అఫ్ thinking ఉంటే మనకు ఆ ప్రాస కళ వస్తుంది అనుకున్నాను. అబ్బో చాలా రాసానండి, ఇంకా రాయడానికి ట్రై చేస్తునే ఉన్నాను. ఉదాహరణకు Sense ఉన్నవాడు salad తింటాడు ... Sense లేని వాడు సమోసా తింటాడు , ప్రేమను ప్రేమించు..మనస్సును మన్నించు...  
             అర్ధమయ్యింది.. నేను  చెప్పిన మాటలకు మీకు hysteria లక్షణాలు వస్తున్నాయి అనుకుంటా ? ప్రస్తుతానికి  నా ప్రాస కళకి comma పెడుతున్నాను. నా డైలాగ్స్ connect చెయ్యడానికి mystery modeలో ఉంటూ జవాబుల కోసం అన్వేషణ, అంతం లేకుండా కోన సాగుతూనే ఉంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే త్రివిక్రమ్ thesisని ఫాలో అయితే  తప్ప మనం ఈ connectivity of త్రివిక్రమ్ స్టైల్ అఫ్  ప్రాస  with common sense ని inspire చేసుకోలేము.


సగటు ప్రేక్షకుడి దృష్టిలో సినిమా అనేది wider range అఫ్ optionsలో ఒకటి. అది కమర్షియల్ ఎలిమెంట్ కావచ్చు, సోషల్ ఎలిమెంట్ కావచ్చు, హ్యూమన్ రిలేషన్స్ కి సంబందించిన కళాత్మక సినిమా కావచ్చు లేక మరొకటి. Average viewerని పక్కన పెట్టి advanced గా ఆలోచించే రామ్ గోపాల్ వర్మ దృష్టిలో అనుకుంటే సినిమా అనేది రెండు రకాలు. మంచి సినిమా లేదా చెత్త సినిమా. ఎలాంటి సినిమా చూసుకున్న అందరు రెండు రకాలుగా సినిమా తీస్తున్నారు. ఒకటి త్రివిక్రమ్ స్టైల్ అఫ్ ప్రాసను follow అవ్వడం లేదా follow అవ్వక వాళ్ళ unique way of స్టైల్ లో సినిమా తియ్యడం.

మొన్నటి వరకు side actor స్థాయిలో ఉన్న మాటలా  రచయిత విలువ ఏకంగా మెయిన్ actor స్థాయిలో value పెరగడానికి త్రివిక్రమ్ గారు ఒక కారణం. త్రివిక్రమ్ ఎందుకు కారణం అని అడగకండి?అతని సినిమాలో రాసే అతని మాటలే మనకు సమాధానాలు చెపుతాయి. 

చిరునవ్వుతో సినిమాలో కథను గుణంగా ఒక డైలాగ్ వస్తుంది. ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్ళు, ఊరి నుండి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు మరి అని. భీమవరం లో పుట్టి పెరిగిన త్రివిక్రమ్ ఊరు దాటి కష్టాలని ఎదుర్కొని తన కాళ్ళపై తను నిలబడి నేడు ఎవరికీ అందని heights of altitudeలో ఉన్నాడు. రచయితగా కాకుండా దర్శకుడిగా రాటు దెలాడు. గడ్డంతో గంభీరంగా కనిపించిన, చిరునవ్వు చిందిస్తూ అమృత పలుకులను పలికించే   మహర్షి అతను.

Second phase అఫ్ సిరీస్ లో  త్రివిక్రమ్ ideology , human relation emotions, అంతేరుగని తన మాటల పల్లకి భావాలు, పంచ్ డైలాగ్స్, ప్రసలు through his movies గురించి తెలుసుకుందాం. తన గురించి చాలా రాయాలి అని డిసైడ్ అయ్యాను కానీ ఏమిటో My mind is wandering with unlimited emptiness rather than thoughts. నాకు ఉన్న కొంచెం పరిజ్ఞానంతో రాయడానికి ట్రై చేశాను. మీ అందరికి నచ్చుతుంది అని ఆకాంక్షిస్తూ... Finally A Very Happy Birthday to Trivikram Sir....


Image source - Google, www.facebook.com/TrivikramDialogues

Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

ONCE AGAIN