నాలోని నేను - Part 1
ఉ: 7:00 ... పక్షుల కిలకిలలు
ఉదయించే రాగాలు
Jazzy Beats...Wake up from the
morning dreams అనే తరహాలో వచ్చే హాయి అయిన సంగీతం .. అదే నా Phone Alarm!
అంత మంచి సంగీతానికి స్పందించక
.. ఫోన్ ని మళ్ళి snooze లో
పెట్టి పడుకునే అ నిద్దురను నేను.
ఊహ లోకానికి దగ్గరగా ఉంటూ .. ఉషోదయాన్ని ఆస్వాదించే ఆశని నేను!
కోయిల కూతను ఆనందించే గాలి
పటాన్ని నేను
ఎన్నో కళలను అభిమానించే
అభిమానిని నేను!
ఎన్నో తీపి స్మృతులకి తియ్యని
కావ్యాన్ని నేను
నా లోని అంతరంగానికి అవకాశమివ్వక
.. ప్రతి రోజు పరుగులు తీసే అవకాశవాదిని
నేను!
తప్పును ఓర్వలేని పంతాన్ని నేనే!
ఆ తప్పును తెలుసుకునే ప్రాశ్చతాపాన్ని నేనే!
లోకానికి బెదరని భావ పౌరుడు అనే
భ్రమలో ఉన్న
కంటికి కనపడే కన్నీటి ధారను
నేను!
నా లోని అంతరంగానికి అవకాశమివ్వక .. ప్రతి రోజు పరుగులు తీసే అవకాశవాదిని నేను!...
ReplyDeleteGreat line
Thank You very much Aneel. Welcome to the blog.
Delete