Dil Se Dekho
దిల్ సే దేఖో Life ని ఒక కొత్త స్ఫూర్తి తో జోర్ సే బోలో I Can Do It అనే ప్రగతి పధంతో అప్పుడే అప్పుడప్పుడే , ఎప్పుడో ఎప్పుడెప్పుడో అంటూ మదనపడుతూ చింతిస్తావా ? ఇప్పుడే ఇంకిప్పుడే ! ఇక్కడే ఇంకిక్కడే అంటూ నీ మనస్సు మౌనాన్ని వదిలేస్తావా? ? పరితపించేది ఎప్పుడు ? ప్రయత్నించేది ఎప్పుడు ? పరుగులు తీసేది ఎప్పుడు ? పులకరించేది ఎప్పుడు ? తమస్సుని తరిమేస్తూ , ఉషస్సుని ప్రతిబింబిస్తూ ఈ తపస్సుకై నీ మనస్సుని మళ్ళించు! ఈ అక్షరాలే నీకు ఆయుధమై , నీ లక్షణాలే నీకు సాయుధమై లక్ష్య సాధనకి అడుగులు వేసేయ్! కలలే నీ ఆశలై , కళలే నీ శ్వాసలై విజయ రెక్కలతో విహరించే సే య్! దిల్ సే దేఖో Life ని ఒక కొత్త స్ఫూర్తి తో జోర్ సే బోలో I Can Do It అనే ప్రగతి పధంతో P.S - ఈ కవిత రాయడానికి Inspiration కేరింత సినిమాలోని Thanks To Zindagi పాట Pic Credit - వజ్ర అలేఖ్య