The Insights of Rajanna...

I know this movie released almost 1 month ago.After watching such a revolutionary movie ,My mind couldn’t made me to wait to write my views.That would be unfair if I skip this wonderful piece .

Story,Screenplay,Direction - Vijayendra Prasad
Fighting Sequences Directed by - S S Rajamouli
Cinematography - Syam K Naidu,Anil Bhandari
Music By - M M Keeravani
Produced by - Akkineni Nagarjuna

Cast
Nagarjuna as Rajanna
Baby Annie as Mallamma
Sneha as Lachhamma,Nassar,Ajay,Pradeep Rawat etc

This movie was carved based on the incidents happened in Nelakondapalli village in Adilabad dist during Razakar’s Movement in 1950.


Malamma is an orphaned girl taken care by old man Sambaiah.She is the honeybunch to the village people as she pacifies and soothe the villagers with her songs. This is all bcaz tha villages were ruled by Dorasani.Her songs makes the dorasani very disturbing .Why Dorasani wants to kill Malamma?? How Malamma gets to know her uproots and how she goes to Delhi to plea Nehru for their freedom is rest of the story.

Everybody acted artistically classy with grace.Of all the Angel in this movie is Baby Annie.Her radical performance dominated over the others.

ఈ సినిమా సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించింది.కీరవాణి అద్బుత స్వరాలు , BGM 's ఇ సినిమాకి హైలైట్.ప్రతి ఒక్క పాట సన్నివేశానికి ,కధకు తగట్టు అనుగుణంగా ఉన్నాయి.

గీ రోజుల్లో సాల మంది ఊరికి దూరంగా పట్నంకు పోయిండ్రు.ఇంకొన్ని దినాలైతే రేపు పోరగాళ్ళు ఊరుని దాదాపు మర్చిపోతారు. గీ సినిమాలో ఊరు అందాలు,కోయిల రాగాలు ,మట్టి మనిషులంటే ఎవరు(basically  మనిషైన మట్టి మనిషే)గివన్ని మనకు అద్దం పటేట్టు సుపిస్తారు.ఎందుకు గివన్ని సెప్తున్నాడు అని అనుకోకండ్రి ,సెప్పాలంటే మనం అంత ఉంటుంది భూమాతా ఒడిలో.గందుకే మనం కూడా మట్టి మనుషులం అని నా భావన.కుమ్మరి కుండలు సేసేది గా నల్ల మన్ను తోనే కదా!.

పైన సేప్పినవాన్ని సాలా సాధారణంగా మన గేయాల రచయిత అనంత్ శ్రీరామ్ ఒక్క మాటలో సెప్పిండు.

నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయ్యమంది కుండ.
సుక్క ఇ కుండ నీళ్ళతో ని గొంతు నిండి నీ పాట సల్లంగుండ
నీ బ్రతుకుల సిరినవ్వు పండ


రజాకార్ల పరిపాలనలో దొరలూ పెదోల్లని, తక్కువ కులపు వాళ్ళని పనులు సేపించుకోవడానికి ,జీతగాళ్ళ లాగా పెట్టుకుండ్రే. ఎమైన తేడా వస్తే బొక్కలు ఇరిగే దాక కొడుతుండే.బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతా అన్నకూడా వినిపించుకుంటే కదా

పైన సేప్పినవటికి నిదర్శనమే గీ సిన్మలోని ఆపకమ్మ పోరాటం పాటలోని అద్బుత సాహీత్యం.

కానీ అప్పటి జామిందరి జులూం గిప్పుడు కూడా ఉంది.గీ  సమాజం కులం అనే ౩ అక్షరాల పదం వల్ల ఇంకా బ్రస్టుపడిపోయింది. కుల వ్యవస్థ కులబడుతే అభివృద్ధి నిలబడుతుంది.గీ రాజకీయ నాయుకుల్ని జరా తిట్టే ముందు జరా మనం మనల్ని తిట్టుకుందాం.

రోజురోజుకి మనం మన పల్లెని దూరంచేసుకుంటున్నాం.చాల మటుకి గీ మధ్య పల్లె కన్నీరు పెడుతుంది.మన బాధ్యత పల్లెల్ని సక్కగా సుసకోవడానికి.అప్పట్లో పల్లెకు వస్తే హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ గాలిని హాయిగా పిల్చేవాళ్ళు.కానీ గిప్పుడేమో SEZ'lu అని, ఫ్యాక్టరీలు కట్టి పర్యవరనంకు హాని కలిగిస్తడ్రు.

అప్పట్లో జామిందరి రుబాబు ఉండేది కానీ గిప్పుడేమో రాజకీయ రౌడీయిజంతో పలుకుబడితో రైతుల గుండెల్లో గుబులు రేపుతూ ఆత్మహత్యే శరణం అనే స్తాయికి వచ్చింది.గ కాలంల దున్నేవాడిదే భూమి.కానీ గిప్పుడేమో బెదిరించేవడిదే భూమి.

వర్షం వస్తే నీళ్ళు వస్తున్నాయి కదా పంటలకి ఎం ఇబ్బంది ఉండది అని రైతులు కుషి జర్పుకంట లేదు. ఎందుకంటే కల్తి విత్తనాలు,జలయజ్ఞం అని ప్రాజెక్టలు సగం సగం కట్టి,జలాశయం నిండిన,గుతకలతో ఉన్న రహదారులు,సరైన సదుపాయాలు,వనరులు సర్కారు కల్పించకపోవడంతో తుఫాను లాంటి వాన రాకపోయినా పంటే పొలాలు,చెట్లు నేలమట్టం అవుతునాయి.

ఇక  పట్నలకి  వస్తే,కొంచెం వర్షం పడితే చాలు రోడ్లు అన్ని నీటితో నిండిపోతున్నాయి.ఇంకా సేప్పుకుంటూ పోతే అధిక ధరలు,చాలి చాలని జీతం,పేదరికం,నీరక్షరస్యత(Illiteracy)….ఏది సుసిన అధికంగాన్నే ఉంటున్నాయి ఒక్క అబ్బివృద్ధి తప్ప.

అయితే గప్పుడు రాజన్నలాంటి వాళ్ళు సాలా మంది పోరాడిండ్రు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది .గిప్పుడెమో కుర్చీలో సోనియమ్మా దయవల్ల రాజకీయ వాళ్ళకి దయ సుపిస్తుంది కానీ ప్రజలపై మాత్రం ఏమి కనికరం సుపిస్తలేదు.గిక గివన్ని మల్లి ఒక్క దారికి రావలంటే,రాజీకయ నాయకులకి బుద్ధి సెప్పాలంటే మనం అందరం రాజన్నలు గవల్సిందే.

Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

Telugu Bhasha Pramukyatha(తెలుగు భాష ప్రాముఖ్యత )