గుర్తుండిపోయే సినిమా (సీతారామయ్య గారి మనవరాలు)

గుర్తుండి పోయే మంచి ఆవకాయ లాంటి తియ్యదనపు సినిమాలలో సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు. నువ్వు నీ ఎదవ comparision!ఆవకాయ కారంగా ఉంటుంది కదా తియ్యదనం ఎక్కడనుండి వచ్చింది అనే ఆలోచనలో పడినట్టు ఉన్నారు కదా?.ఏం లేదండి మన ప్రతి తెలుగింట్లో ఆవకాయని ఎంత ఇష్టంతో అరగిస్తామో ఇష్టాన్ని తియ్యదనంతో ఇలా సినిమాని పోల్చుతున్నాను.అమ్మ,ఆవకాయ,అంజలి అంటే నాకు ఇష్టం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన Directorial debut (దర్శకత్వ పరిచయం)'నువ్వే నువ్వే ' సినిమాలో హీరోతో చెప్పిస్తాడు. సినిమా కూడా అలాంటి అమ్మ ,ఆవకాయ లాంటి సినిమానే. తెలుగు తనపు తియ్యదనంలో  తన్మయత్నం పొందే  సినిమాలో సినిమా ఒక్కటి! 

జీవితం అని పిలువబడే పుస్తకంలో( అంటే మనలో) ఒక పేజి(జీవన తరంగాలలో ఒకటి) ఏంటి అంటే అది అనుబంధం. దర్శకుడు క్రాంతిగారు  అనుబంధం అనే ఆత్మని కథగా మలిచి  సినిమాని ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయేల తీర్చిదిద్దారు.మరి మనం కూడా అనుబంధం అనే ప్రపంచంలోకి వెళ్లి కొన్ని విశేషాలు తెల్సుకుందాం రండి.

              
 

తన చూపులలో రాజసం,మాటలతో గంభీరత్వం చూపించి,అప్పుడప్పుడు  అల్లరి చేసే చిలిపితనపు చిన్ని కృష్ణుడిల,అలిగె వ్యక్తిల అందరి ఇంట్లో ఉండే పెద్దరికపు పెద్దమనిషి, అజనబహుడు అయిన మన తాతయ్యలాగే అదేనండి సీతారామయ్యగా అక్కినేని నాగేశ్వర్ రావు గారు నటించారు ఇక  కొంటెతనం, చలాకీతనం ,గడుసుతనం ,భక్తి/భయం గల లక్షణాలు ఉండే  మనవరాలిగా మీనా నటించారు.తాతయ్య/మనువరాలు మధ్య సాగే  సంభాషణలు,ఆనంద బాష్పాల అనురాగాల చిత్రమే సీతరామయ్య గారి మనువరాలు చిత్రం. అయితే  చిత్రంలోని ప్రధాన ఆకర్షణ అక్కినేని గారు  మరియు మీనా అయినాను, దర్శకుడు ఇందులో  పక్కన  ఉండే  పాత్రాలును (Characters) కూడా చక్కగా ఉపయోగుంచుకొని చిత్రాన్ని అందమైన కుటుంబం అనే అద్దం వలె తీర్చిదిద్దారు. 

సినిమాకి కథ ఆరో ప్రాణం అయితే కథకి ఆరో ప్రాణం సంగీతం.వేటూరి గారి అద్భుతమైన సాహిత్య రచనలో కీరవాణి గారు పాటలని స్వర పరిచారు.మనస్సుని ఉత్తేజపరిచేలా ఉల్లాసభరితంగా సాగే పాటల పల్లకిలొని సంగీత సాగరంలో ఇప్పటికి మనం ప్రవహిస్తున్నాం. అది 'పూసింది పూసింది పున్నాగ' పాటలోని తేనే తెలుగు పలుకులు అయితేనేమి? కలికి చిలకల కొలికి మాకు మేనత్త అని  బంధుత్వాల సంబంధాలు తెలిపే తియ్యని మానవత్వ పాట అయితే నేమి? పాట విన్న అది ప్రీతీ ప్రియం ..అనురాగ వర్షం!

వికీ వాస్తవాలు
1. చిత్రాన్ని తరువాత హిందీ/మలయాళం/కన్నడ బాషలో పునర్నిర్మాణం(Remade)  చేసారు.
2. తొలి పరిచయంగా(Debut Actress) సినిమా ద్వారే మీనా మలయాళంలో(Sandhwanam) , కాజోల్ హిందీలో(Udaar ki Zindagi) అక్కడి ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.
3. కన్నడ/హిందీ నటి రోహిణి హట్టన్గడి చిత్రంలో నానమ్మ పాత్రలో నటించారు. తను 1982 లో Richen Attenborough తీసిన Gandhi చిత్రంలో కస్తుర్బా Gandhi గా నటించారు. చిత్రంలో తన నటనకు గాను ప్రతిష్టాత్మిక BAFTA(British Academy of Film and Television Arts (ఉత్తమ సహాయ నటి) అవార్డు గెలుపొందారు( అవార్డు పొందిన ఏకైక భారితయ నటి తనే కావడం మరో విశేషం) 
4. ఈ చిత్రానికి సంవత్సరంలో ఉత్తమ నటి (మీనా),ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ గాయని(చిత్ర,కలికి చిలకల కొలికి మాకు మేనత్త పాటకు) నంది పురస్కారాలు లభించాయి. అలాగే ఉత్తమ హీరో(అక్కినేని నాగేశ్వర్ రావు గారు), ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు(క్రాంతి కుమార్)కి దక్షిణ ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి. 
పైన చెప్పిన విషయాలు వికీ నుండి సేకరించబడినవి (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి) 

నాకు సినిమానే కాకుండా, చివర్లో వచ్చిన చిత్ర సందేశం కూడా బాగా నచ్చింది.
మమతానురాగాల శాఖాచంక్రమణం
అక్కడ(నదిలో) ప్రవహిస్తున్న గోదావరి లాగానే
ఎక్కడో సంసార సాగరంలో కలిసి,
సంతోష మేఘలుగా ఎగసి,
అనురాగ వర్షంగా కురిసి,
జీవనదిగా వెలసి,
తిరిగి సాగరంలో కలిసి...
మేఘలుగా ఎగసి...
నిరంతరంగా ..తరం తరంగా..
కుటుంబ జీవన ఔన్నత్యానికి అద్దం పడుతుంది.  

ఇందాక నేను అనుబంధాల ప్రపంచానికి  వెళ్ళోదాం అని చెప్పను కదా!అలా ఎందుకు అన్నాను అంటే మనం ఇప్పుడు ఉంటున్న లోకంలో ప్రతి మనిషి స్వార్ధం అనే స్వార్ధ ప్రంపంచంలో ఉంటున్నాడు కానీ బంధుత్వాలతో కూడిన లోకంలో ఉంటాలేదు.చిన్నపుడు ఇంటి వాకిలిలో మంచం వేసుకొని అలా వెన్నెలనిచ్చే చంద్రుడిని చూస్తూ తాతయ్య/నానమ్మ/అమ్మమ్మ చెప్పే కబ్బుర్లు, కథలు/పొడుపు కథలు,పద్యాలు నేటి కాలంలో చూస్తున్నామా?  నిజం చెప్పాలి అంటే చాల తక్కువే అని చెప్పాలి. 

నేటి  ఆధునిక యుగంలో మనిషిపై చూపే ప్రేమ,ఆప్యాయతలను మనం యంత్రాలపై చూపిస్తున్నాం.అందరు కలిసి మెలిసి ఉండే ఉమ్మడి కుటుంబంని మనం ఎక్కడ చూస్తున్నాం? విషయంలో కూడా మనం ఓడిపోయం.రోజురోజుకి మన ఆచార వ్యవహారాలను మనమే బ్రస్టు పట్టిస్తునం. మంచితనం అనే మానవత్వాన్ని ముటకట్టి అటకపై వేసి మృగం అనే రాక్షసులని బయటకి చూపిస్తున్నాం. 

 కనీసం ఇలాంటి ఆనిముత్యపులాంటి చిత్రాన్ని నేటి తరం వారికీ(నిన్నటి తరం వారికి కూడా) తవ్వకాలో నుంచి తీసి అలానాటి అనురాగాల అనుబంధాల హరివిల్లుని వ్యాప్తి చేద్దాం! సినిమా చూసి మనం మధన పడుదమో లేక మనస్సు తేలిక అయ్యిందా అని అనుకుందామా ? ప్రశ్న మన పై వేసుకొని మనమే ఆలోచిద్దాం! 

video credit  @ youTube User - aptorrent



Comments

  1. చాలా బాగా రాసినావు దీప్. ఇది చదువుతుంటే నేను, మా అమ్మ కలిసి ఈ చిత్రాన్ని చూసిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నువ్వు చెప్పినట్టుగా ఈ చిత్రం చూస్తుంటే కుటుంబ అనుబంధాల విలువ ఏమిటో తెలుస్తది. చాల సంవత్సరాల తర్వాత మళ్ళి ఈ మంచి చిత్రం గురించి గుర్తు చేసి మంచి పని చేసావ్.

    ReplyDelete
  2. సిద్ధూ
    ఎప్పటిలాగే అభిమానంతో నేను రాసిన పోస్ట్ ఓపికగా చదివినందుకు ధన్యవాదములు. నువ్వు చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎప్పుడు తార స్థాయిలోనే ఉంటాయి. మీ అమ్మగారి తో చుసిన సినిమా ఇప్పటికి తీపి స్మృతిగా గుర్తు చేసుకునందుకు జోహార్లు. Once again thank you for u r grateful words..!

    ReplyDelete

Post a Comment

Thank you for commenting.Your Golden words will be a route for me to get inspired to write the platinum posts...:) :)

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

ONCE AGAIN