గుర్తుండిపోయే సినిమా (సీతారామయ్య గారి మనవరాలు)
గుర్తుండి పోయే మంచి ఆవకాయ లాంటి తియ్యదనపు సినిమాలలో సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు . నువ్వు నీ ఎదవ comparision! ఆవకాయ కారంగా ఉంటుంది కదా ఈ తియ్యదనం ఎక్కడనుండి వచ్చింది అనే ఆలోచనలో పడినట్టు ఉన్నారు కదా ?. ఏం లేదండి మన ప్రతి తెలుగింట్లో ఆవకాయని ఎంత ఇష్టంతో అరగిస్తామో ఆ ఇష్టాన్ని తియ్యదనంతో ఇలా సినిమాని పోల్చుతున్నాను . అమ్మ , ఆవకాయ , అంజలి అంటే నాకు ఇష్టం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన Directorial debut ( దర్శకత్వ పరిచయం )' నువ్వే నువ్వే ' సినిమాలో హీరోతో చెప్పిస్తాడు . ఈ సినిమా కూడా అలాంటి అమ్మ , ఆవకాయ లాంటి సినిమానే . తెలుగు తనపు తియ్యదనంలో తన్మయత్నం పొందే సినిమాలో ఈ సినిమా ఒక్కటి ! జీవితం అని పిలువబడే పుస్తకంలో ( అంటే మనలో ) ఒక పేజి ( జీవన తరంగాలలో ఒకటి ) ఏంటి అంటే అది అనుబంధం . దర్శకుడు క్రాంతిగారు ఆ అనుబంధం అనే ఆత్మని కథగా మలిచి ఈ సినిమాని ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయేల తీర్చిదిద్దారు . మరి మనం కూడా ఆ అనుబంధం అన...