సూర్యం తాత
అద్దం లో చూసుకుంటూ , మీసాలను సరి చేసుకొని , టేబుల్ పైన ఉన్న కళ్ళజోళ్ళని తీసుకొని తెల్లటి వస్త్రం తో తుడిచి కళ్ళజోళ్ళని పెట్టుకున్నాడు , పక్కన ఉన్న వాకింగ్ స్టిక్ పట్టుకొని బయట వరండా కి వచ్చాడు సూర్యం . తన వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అని అటు ఇటు నేలపై చూసాడు . ఎక్కడ కనపడలేదు . అమ్మ కావేరి , నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాడు సూర్యం . తెలీదు నాన్న , అక్కడే ఎక్కడో ఉంటాయి చుడండి అని ఇంటి లోపల నుండి మాటలు వినిపించాయి సూర్యానికి . ప్రొదున్న ఇక్కడే విడిచాను కదా .. ఎక్కడికి పోయాయి అని నేల పై చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సూర్యం (సూర్యం తాత అని వెనకనుండి పిలుపు సూర్యానికి వినిపించింది) ఒరే మనవడా నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అనే లోపు... నాకు తెలుసు తాత ,, ఇదిగో నీ కోసమే కొత్తవి తెచ్చాను అంటూ ఇచ్చాడు . ఇప్పుడు కొత్తవి ఎందుకు రా , పాతవి బాగానే ఉన్నవి కదా .. అనవసరమైన ఖర్చు ? అబ్బా మీరు ఎం మాట్లాడకండి , ముందు కుర్చీ మీద కూర్చోండి అంటూ , కాళ్