Posts

Telugu Bhasha Pramukyatha(తెలుగు భాష ప్రాముఖ్యత )

Image
  అందరికి శుభవందనం!ఇదేంటి ఈ వెధవ ఇలా తెలుగులోకి మారిపోయాడు ఏంటి  అని అనుకుంటున్నారా? ఎం లేదండి ..జస్ట్ ఫర్ Change ..కొంచెం మార్పూ కోసం ఇలా రాస్తున్నాను అంతేనండి.మన సమాజంలో కొంచెం మార్పూ రావాలి అంటే మనం కూడా మారాలి కదా.అందుకే అలా ఇళయరాజా గాణాలు వింటూ నా గగనయంత్రం(కంప్యూటర్) నుండి ఈ వ్యాసం రాస్తున్నాను.  ఎందుకో ఏమో కానీ చిన్నపుడు బుర్ర పెట్టలేదు ఈ అచ్చులు,హల్లులు,గుణింతాలు ఇంకా వగైరా వగైరా మీద. అందుకే మన తెలుగు బాష మీద ఎంత పట్టు ఉందో తెల్సుకుందామని ఇలా ఈ వ్యాసం తెలుగులో రాస్తునన్నమాట!ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటా...ఈ పింజారి వెధవకి మార్పూ ఎందుకు వచ్చిందో(lol)!తెలుగు భాషలో ఉన్న నేర్పు,స్పష్టత,కూర్పు,భావం నాకు చాలా బాగా నచ్చుతుంది.అందుకే అనుకుంట మన శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు " దేశ భాషలందు తెలుగు లెస్స " అని.నిజమే కదా !       ఎందరో మహనీయులు మన తెలుగు భాష ప్రాముఖ్యత గురించి చాటి చెప్పారు. అప్పటి తరం నన్నయ,తిక్కన నుంచి మొన్నటి తరం గురుజాడ,వీరేశలింగం పంతులు , నిన్నటి శ్రీ శ్రీ నుంచి నేటి సి.నా.రే ,వేటూరి,సిరివెన్నెల మన తెలుగు భాష మ